Tuesday, October 14, 2025
E-PAPER
Homeజాతీయం71మందితో బీజేపీ తొలి జాబితా విడుద‌ల‌

71మందితో బీజేపీ తొలి జాబితా విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ ఎల‌క్ష‌న్స్ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో పోటీ చేసే పార్టీ అభ్య‌ర్థుల‌ను బీజేపీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం 71మంది కూడిన మొద‌టి జాబితాను విడుద‌ల చేసింది. మొత్తం 243 బీహార్ అసెంబ్లీ స్థానాల‌కు రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని ఈసీ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. న‌వంబ‌ర్ 6న మొద‌టి ద‌శ‌లో 121 స్థానాల‌కు, 11న రెండో ద‌శ‌లో మిగిలిన స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే నెల‌ 14న పోలింగ్ ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

గ‌త ఆదివారం ఎన్డీయే కూట‌మి భాగ‌స్వాములైన బీజేపీ, జేడియూ, లోక్ జ‌న్ శ‌క్తి పార్టీ(LJP), జ‌న‌తాద‌ళ్(యూనైటైడ్), హిందుస్థాని ఆవామ్ మోర్చా(HAM-సెక్యుల‌ర్), రాష్ట్రీయ లోక్ మోర్చా(RLM) సీట్ల పంప‌కాల‌పై భేటి అయిన విష‌యం తెలిసిందే. సుదీర్ఘ చ‌ర్చ‌ల త‌ర్వాత ఎన్డీయే కూట‌మి పార్టీలు ఏకాభిప్రాయానికి వ‌చ్చాయి. బీజేపీ, జేడియూ చెరో వంద స్థానాల్లో పోటీ చేయ‌గా..LJP-29, RLM-06, HAM ఆరు స్థానాల‌లో పోటీ చేయ‌నున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -