Monday, May 12, 2025
Homeక్రైమ్పోలీసుల అత్యుత్సాహం..

పోలీసుల అత్యుత్సాహం..

- Advertisement -

– యువతిని కిడ్నాప్‌ చేశావంటూ ఓ యువకుడిని చితకబాదిన వైనం
– ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
– కనగల్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై నల్లగొండ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు
– పోలీసులను సస్పెండ్‌ చేయాలి
– ప్రయివేట్‌ వ్యక్తులపై కేసు నమోదు చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయప్రతినిధి

నల్లగొండ పట్టణం పానగల్లుకు చెందిన యువతిని కిడ్నాప్‌ చేశారన్న ఆరోపణతో కనగల్‌ ఎస్‌ఐ విష్ణు, కాని స్టేబుల్‌ బురహన్‌ ఉద్దీన్‌.. అదే ప్రాంతానికి చెందిన కుంచం నవీన్‌ను చితక బాదారు. బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురై నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులో కొచ్చింది. తల్లి యాదమ్మ.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్లగొండ పట్టణంలోని టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితుడి తల్లి ఫిర్యాదు చేశారు. ఆమె వివరాల ప్రకారం.. పానగల్లుకు చెందిన నవీన్‌, అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. ఈ క్రమంలో యువతి ఈ నెల 9న దామరచర్లలో పనిచేసుకుంటున్న నవీన్‌ను రమ్మని ఫోన్‌ చేసింది. నవీన్‌ ఆ యువతి అమ్మమ్మ ఊరైన కనగల్‌ మండలంలోని పర్వతగిరికి వెళ్లాడు. అక్కడ వారు మాట్లా డుకున్నారు. అక్కడి నుంచి నవీన్‌ తిరిగి దామరచర్లకు వెళ్ళిపోయాడు. అయితే, కనగల్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి కానిస్టేబుల్‌ బురహాన్‌ ఉద్దీన్‌ నవీన్‌కు ఫోన్‌ చేసి యువతిని కిడ్నాప్‌ చేశావంటూ స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేశాడు. మరుసటి రోజు వస్తానని చెప్పినా.. పట్టించుకోలేదు. అదే రోజు రాత్రి కానిస్టేబుల్‌తో పాటు యువతి బంధువులు నలుగురు కలిసి నవీన్‌ ఇంటిపై దాడి చేసి అర్ధరాత్రి అతన్ని కొట్టుకుంటూ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో ఎస్‌ఐ విష్ణు నవీన్‌ను సెల్‌లో వేసి చితకబాదారు. ఆ యువతి హైదరాబాద్‌ నుంచి ఫోన్‌ చేసిందంటూ పదో తేదీ ప్రయివేట్‌ వాహనంలో సికింద్రాబాద్‌కు తరలించారు. విచారణ పేరుతో తీవ్రంగా కొట్టారు. పదో తేదీ రాత్రి మొత్తం కారులో తిప్పుతూ చితకబాదారు. ఆదివారం ఉదయం 12 గంటల సమయంలో స్టేషన్‌కు తీసుకొచ్చి యువతి తండ్రి, బంధువులు మళ్లీ చితక్కొట్టారు. ఈ వరుస దాడులతో నవీన్‌ స్పృహ తప్పిపడిపోయాడు. స్టేషన్‌ బయట ఉన్న బంధువులను పిలిపించి ఆస్పత్రికి తీసుకెళ్లం డని చెప్పడంతో వారు హుటాహుటినా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి తల్లి యాదమ్మ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవీన్‌, ఆ యువతి కొంతకాలంగా ఇష్టపడుతున్నారని, అది ఇష్టంలేక ఆమె తల్లిదండ్రులు, బంధువులు, పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండానే తన కుమారున్ని చిత్రహింసలకు గురిచేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో వేడుకుంటుంది.
నవీన్‌ను పరామర్శించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న నవీన్‌ను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవీన్‌, యువతి ప్రేమించుకుంటు న్నారని, వారిద్దరూ మేజర్లని తెలిపారు. ఇరు కుటుం బాల బంధువులు, తల్లిదండ్రులు అంగీకారం తెలిపి వారికి పెండ్లి చేస్తే మంచిందని సూచించారు. నవీన్‌ విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించడంతో పాటు, ప్రయివేట్‌ వ్యక్తులతో కలిసి కొట్టడం సరికా దన్నారు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడన్నారు. నవీన్‌ది తప్పుంటే చర్యలు తీసుకోవడంలో తప్పులేదని, కానీ ప్రేమించినం దుకు హింసించడం దారుణమన్నారు. అమ్మాయిని పోలీసులు, ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యు లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని కోరారు. ఆధారం లేకుండా చితకబాదిన ఎస్‌ఐ, పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పరామర్శించిన వారిలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, హాలియా మండల కార్యదర్శి అవుతా సైదులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -