- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అమెరికా లోని న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన యుఎన్జిఏ సమ్మిట్ లో దక్షిణ భారతదేశం నుండి పాల్గొని భువనగిరి పార్లమెంట్ సభ్యులు రేపు హైదరాబాద్ కు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అతహర్ మీడియాకు తెలిపారు. అమెరికా లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల నుండి ప్రజా ప్రతినిధులు విచ్చేసి పలు అంశాల పై చర్చించారని తెలిపారు. ముఖ్యంగా పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పుల పై పర్యావరణ నిపుణులతో సుదీర్ఘ చర్చలు జరిగాయని దక్షిణ భరతదేశంలోని వాతావరణం పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు అక్కడ వివరించడం జరిగిందని అన్నారు.
- Advertisement -