Wednesday, October 15, 2025
E-PAPER
HomeNewsగ్రామ సంఘంలో బ్యాంకు లోన్ రికవరీ చేయండి.. ఐకెపి డి.పి.యం శ్రీనివాస్

గ్రామ సంఘంలో బ్యాంకు లోన్ రికవరీ చేయండి.. ఐకెపి డి.పి.యం శ్రీనివాస్

- Advertisement -

నవతెలంగాణ గాంధారి

గ్రామ సంఘాలలో ఉన్న బ్యాంకు లోన్‌లు రికవరీ పెండింగ్‌గా ఉన్నవి వసూలు చేయాలని ఐకెపి డిపిఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. గాంధారి మండలంలోని చద్మల్ గ్రామంలో ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సంఘాలు తీసుకున్న బ్యాంకు లోన్లు పెండింగ్ లోన్లను వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే బ్యాంకు లింకేజీ అచీవ్‌మెంట్ విషయమై పలు సూచనలు చేసి, కొత్త సంఘాల ఏర్పాటులో జరుగుతున్న ప్రగతిని పరిశీలించారు. అదేవిధంగా, బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించనిచో ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తుంది కాబట్టి ఆ వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతేకాక, సంఘంలో చేరిన ప్రతి మహిళకు 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధారి ఏపిఎం, సీసీ, సంబంధిత వివోఏలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -