నవతెలంగాణ-హైదరాబాద్ : ‘ఆర్‌ఆర్‌ఆర్’.. ప్రపంచం ముందు భారతీయ సినిమా సత్తా చాటింది. పీరియాడిక్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకొని ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఆ పేరు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉంది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్’ నిర్వహించారు. రాయల్ ఫిల్ హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన ప్రదర్శనతో అతిథులను మంత్రముగ్దుల్ని చేశారు. ఈవెంట్‌కు హీరోలు ఎన్టీఆర్ , రామ్‌చరణ్ , డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చిరంజీవి, బాలకృష్ణల గురించి ప్రస్తావించారు.
‘నాటు నాటు’లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు డ్యాన్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పాట గురించి తారక్ మాట్లాడుతూ.. ‘‘ఈ పాటలో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్‌చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. చిరంజీవి ఎంతగొప్ప డ్యాన్సరో మనందరికీ తెలుసు. అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్. వీళ్లిద్దరూ కలిసి నాటునాటుకు డ్యాన్స్ వేస్తే.. అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుంది’’ అని అన్నారు. దీంతో హాల్ మొత్తం కేరింతలతో మారుమోగింది. ఇక ఇదే వేదికపై తారక్‌కు ముందస్తుగా చరణ్ పుట్టినరోజు విషెస్ చెప్పి ప్రేమగా హత్తుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చిరు, బాలయ్యా ‘నాటు నాటు’కు డ్యాన్స్.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES