Wednesday, October 15, 2025
E-PAPER
Homeజాతీయంప్రయివేటు బస్సులో మంటలు.. 20 మంది మృతి

ప్రయివేటు బస్సులో మంటలు.. 20 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళుతున్న ఒక ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి 20 మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడగా, వారిని స్థానిక జవహర్ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జైసల్మేర్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరిన ప్రైవేటు బస్సు థాయత్ గ్రామ సమీపంలోకి రాగానే వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -