నవతెలంగాణ – హైదరాబాద్: విరాట్, రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డే ఫార్మాట్‌లో ఇంకా ఆడుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత ఇద్దరూ రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియాలో జోరుగా వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రజెన్స్ జట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇద్దరూ గ్రేట్ ప్లేయర్స్. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో వారే కీలకం. రిటైర్మెంట్ అనేది వారి ఇష్టం. కానీ ఇదే చివరి సిరీస్ అని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఇది కేవలం అసత్య ప్రచారం మాత్రమే. ఇద్దరూ మరిన్ని సిరీస్‌లు ఆడే అవకాశం ఉందని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై కీలక అప్ డేట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES