నవతెలంగాణ – హైదరాబాద్: 45 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ దొంగ 15 ఏండ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. గతంలో చిక్కినట్లే చిక్కి తప్పించుకోవడంతో 11 మంది పోలీసుల సస్పెన్షన్‌కు కారణమయ్యాడు. చివరికి ఓ రోడ్డు ప్రమాదానికి గురై దొరికిపోయాడు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురానికి చెందిన తెలుగుమల్లెపూల నాగిరెడ్డి(33) జల్సాలకు అలవాటుపడి తన 18వ ఏటా నుంచి చోరీల బాటపట్టాడు. ఇప్పటివరకు ఉమ్మడి అనంతపురం, కడప, కర్నూలు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగతనాలు చేశాడు. అతనిపై ఆయా స్టేషన్లలో 45 కేసులు నమోదవడంతో పోలీసులు విస్తృతంగా గాలించారు. అలా 2023లో వైఎస్సార్ కడప జిల్లా కొండాపురంలో పోలీసులకు చిక్కినా, అనూహ్యంగా వారి నుంచి తప్పించుకున్నాడు.
45 కేసుల్లో నిందితుడు.. రోడ్డు ప్రమాదంలో చిక్కాడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES