- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గోవా వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయిక్ అకస్మాత్తుగా గుండెపోటుతో మంగళవారం రాత్రి మరణించారు. 1980లో మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాయిక్, తరువాత కాంగ్రెస్‌లో చేరి 1991, 1994లో రెండు సార్లు సీఎం అయ్యారు. 1998–99లో లోక్‌సభా సభ్యుడిగా కూడా సేవలందించారు. 2022 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ప్రహ్మోద్ సవంత్ నేతృత్వంలోని ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి గా పనిచేశారు.
- Advertisement -