Wednesday, October 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటికెట్ లేకుండా రైలు ప్రయాణం.. కోటి రూపాయల ఫైన్

టికెట్ లేకుండా రైలు ప్రయాణం.. కోటి రూపాయల ఫైన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) టికెట్ లేకుండా ప్రయాణించిన వారిపై భారీ చర్యలు చేపట్టింది. సోమవారం జోన్‌ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 16 వేల మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుని రూ.1.08 కోట్ల జరిమానా వసూలు చేసింది. ఇది SCR చరిత్రలో ఒకేరోజు అత్యధిక వసూళ్లుగా నిలిచింది. వియజయవాడ డివిజన్‌లో ₹36.91 లక్షలు, గుంతకల్లు ₹28 లక్షలు, సికింద్రాబాద్ ₹27.9 లక్షలు, గుంటూరు ₹6.46 లక్షలు, హైదరాబాద్ ₹4.6 లక్షలు, నాందేడ్ ₹4.08 లక్షలు వసూలైనట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -