Tuesday, May 13, 2025
Homeజాతీయంఆప‌రేష‌న్ సింధూర్‌తో పాక్‌కు భారీ నష్టం: ఇండియాన్ ఎయిర్ ఫోర్స్

ఆప‌రేష‌న్ సింధూర్‌తో పాక్‌కు భారీ నష్టం: ఇండియాన్ ఎయిర్ ఫోర్స్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జ‌మ్మూలోని ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో 22మంది అమాయ‌క ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ఆగ్ర‌హించిన భార‌త్.. దాయాది దేశంపై దౌత్య‌ప‌రంగా క‌ఠిన ఆంక్ష‌లు విధించ‌డంతోపాటు మే 7 ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై ఎటాక్ చేసి భార‌త్ ఆర్మీ విధ్వంసం సృష్టించింది. నాలుగు రోజుల‌పాటు సాగిన ఇండియా ఆర్మీ దండ‌యాత్రకు పాక్ ఉక్కిరిబిక్కిరైంది. దీంతో ఢిల్లీతో ఇస్లామాబాద్ చ‌ర్చ‌ల‌కు సిద్ధంగానే ఉంద‌ని ఆదేశ ర‌క్ష‌ణ‌మంత్రి కాళ్లబేరానికి వ‌చ్చారు. దీంతో ఇరుదేశాలు త‌క్ష‌ణ కాల్పులు ఒప్పందానికి అంగీక‌రించాయి. తాజాగా భార‌త్ చేపట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌తో పాక్ భారీ న‌ష్టం వాటిల్లంద‌ని ఇండియాన్ త్రివిద ద‌ళాల‌ అధిప‌తులు వెల్ల‌డించారు. పాక్ ఉగ్ర‌శిబిరాల‌కు వేదిక‌లైన మురిడ్కే, బహవల్పూర్ ప్రాంతాలు ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ దాడుల‌కు కుదేలైయ్యాయ‌ని చెప్పారు. పాక్ వేదిక‌గా ఉగ్ర‌కార్య‌క‌లాపాల‌కు పాల్పడుతున్న‌ జైసే మ‌హ్మ‌ద్, ల‌ష్క‌రే తోయిబ్ ఉగ్ర సంస్థ‌ల కీల‌క స్థావ‌రాల‌ను త‌మ ఫైట‌ర్ జెట్లు కూల్చివేశాయ‌ని చెప్పారు. పాకిస్థాన్‌లో మొత్తం ఐదు క్యాంప్‌లు ఉండగా పీవోకే కేంద్రం 9 ఉగ్ర‌వాదుల శిబిరాల‌పై ఇండియాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింద‌ని చెప్పారు. ఈ దాడుల్లో ఆయా ఉగ్ర‌వాద సంస్థ‌ల కీల‌క భూభాగాలు ధ్వంస‌మైయ్యాయ‌ని, భార‌త్ వైమానిక దాడుల‌తో ఆయా ఉగ్ర‌సంస్థ‌లు చావుదెబ్బ తిన్నాయ‌న్నారు. మురిద్కేలోని లష్కర్ల బలమైన స్థావరం మర్కజ్ తైబా, బహవల్పూర్‌లోని జైష్ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుభాన్ అల్లాహ్‌లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశామ‌న్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఆర్మీ అధికారులు విడుద‌ల చేశారు.


Impact Points:After Attack:

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -