Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ – చండూర్

ఖరీప్ సీజన్ ప్రారంభమైనందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చండూరు మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం మోగుదాల వెంకటేశం అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి తరుగు, తూకాలలో మోసాలను అరికట్టాలని ఆయన అన్నారు. నల్గొండ జిల్లాలో ఖరీఫ్  సీజన్లో వరి ధాన్యంను రైతాంగం అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు అక్కడక్కడ ప్రారంభించారని, కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని ఆయన అన్నారు.

తరుగు పేరుతో రెండు కేజీలు, తూకాల్లో మోసం జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నందువల్ల ఇలాంటివి జరగకుండా రైతాంగానికి తగిన న్యాయం జరిగే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. తడిచిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, రబీ సీజన్లో రైతులకు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని అప్పుడు కొంతమందికి రైతులకు మాత్రమే బోనస్ ఇచ్చారని, గతంలో బోనస్ జమ కాని రైతులకు బోనస్ ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  ట్రాన్స్పోర్ట్ కొరత లేకుండా గోనే సంచులు ప్రభుత్వమే ఇవ్వాలని  ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం అకాల వర్షాల వలన తడిసి రంగు మారిన ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

జిల్లాల్లో అక్కడక్కడ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతుల నుంచి ధాన్యము కొనుగోలు వేగవంతం చేయాలని, మునుగోడు నియోజకవర్గం లో ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టెంటు వేసి మంచినీళ్లు సౌకర్యం కల్పించి రైతాంగానికి వడదెబ్బ తగలకుండా ప్రజలనుకాపాడాలని కోరారు. కొనుగోలు కేంద్రాలలో తూకాల్లో మోసం తరుగు పేరుతో తీయడం లాంటి సంఘటనలు జరుగుతున్నందున అధికారులు మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని కోరారు. లేకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి జెర్రీపోతుల ధనంజయ, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం, చిట్టి మల్ల లింగయ్య, గౌసియా బేగం , ఈరటి వెంకటయ్య, కొత్తపల్లి నరసింహ, బల్లెం స్వామి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -