మండల విద్యాశాఖ అధికారి జి స్వర్ణ జ్యోతి…
నవతెలంగాణ – మణుగూరు
అబ్దుల్ కలాం ఆశయాలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని మణుగూరు మండలం విద్యాశాఖ అధికారి జి స్వర్ణ జ్యోతి విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగాప్రాథమికోన్నత పాఠశాల కూనవరంలో ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కలలు కనా లని, ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం ఇష్టపడి చదవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ ప్రణాళిక బద్ధంగా కష్టపడి సమయాన్ని ఉపయోగించుకొని ప్రిపేర్ కావాలన్నారు.
ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం ను మానిటరింగ్ చేయడానికి మానిటరింగ్ టీం తో పాటుగా విచ్చేసి తరగతుల ను, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ విద్యార్థులకు ఏపీజే కలాం యొక్క జీవిత చరిత్రను వివరించారు. ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్రపై వ్యాసారచన మరియు ఉపన్యాస పోటీలను నిర్వహించారు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ బ్రహ్మయ్య, కిషోర్, విష్ణు, బాలాజీ, టీచర్స్ సారయ్య రుక్మిణి సరిత రఘుమోహన్రావు అనిత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.