Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు 

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు 

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి 
గాలికుంటు వ్యాధి నివారణకు పశువులకు టీకాలు తప్పని సరిగా వేయించాలని మండల పశువైద్యధికారి డాక్టర్ శ్రుతి రైతులకు సూచించారు. బుధవారం మండల వ్యాప్తంగా పశువులకు గాలికుంటు టీకాలు వేశారు. ఈ సంద్భంగా డాక్టర్ మాట్లాడుతూ… పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలను సులువుగా గుర్తించవచ్చు అని తెలిపారు. పశువుల్లో తీవ్రమైన జ్వరం రావడంతో పాటు నీరసించిపోతాయి, నోటి నుంచి తీగల వలే చొంగ కారుతూ ఉంటుంది, కాలిగిట్టలు, నోటి వద్ద పుండ్లు ఏర్పడతాయి అని వివరించారు. చూడి పశువులు అయితే ఈనుకుపోతుందని వీటి పాలు తాగే దూడలు మరణిస్తాయి అన్నారు.

పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో పాటు పశువుల పని సామర్థ్యం అంతేస్థాయిలో తగ్గుతుందన్నారు. దీనివల్ల పాడి రైతుకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. వైద్యంపై నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోతాయి అని హెచ్చరించారు. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువులకు  తప్పని సరి వేయించాలి అన్నారు. రైతులు కచ్చితంగా మీ పాడి ఆవులు, గేదెలకు ఈ టీకా వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఎల్ఎస్ఏ వెంకటయ్య, విఏ గణేష్, సిబ్బంధి, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -