Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి

పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి

- Advertisement -

పశువైద్య సహాయకులు సంధ్య, అనిల్ 
నవతెలంగాణ- పెద్దవంగర
గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని పశువైద్య సహాయకులు సంధ్య, వాంకుడోత్ అనిల్ నాయక్  అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పశువైద్య ఉప కేంద్రంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఉచితంగా టీకాలు వేయించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. 4 నెలలు దాటిన పశువుకు గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాలు విధిగా వేయించాలని అన్నారు. మొదటి రోజు 144 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో తీవ్ర జ్వరం, కాలిగిట్టల మధ్య పగుళ్లు, నోటిలో పుండ్లు, బాగా నీరసించి పోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం, పని సామర్థ్యం తగ్గడం వంటి మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు. మండలంలో ఉచిత టీకాల కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందని, పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -