Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు అందుబాటులో వెటర్నటీ డిపార్ట్మెంట్ ఉండాలి

రైతులకు అందుబాటులో వెటర్నటీ డిపార్ట్మెంట్ ఉండాలి

- Advertisement -

-ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్

రైతులకు అందుబాటులో వెటర్నటీ డిపార్ట్మెంట్ ఉండాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం, యాదగిరిగుట్ట మండలం చోల్లేరు ఉచిత గాలి కుంటు టీకా కార్యక్రమంలో  బీర్ల అయిలయ్య పాల్గొని, ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతుల యొక్క పశువుల కోసం మెడిసిన్ అందజేసి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతులకు వ్యవసాయానికి వెన్నుమూకలుగా ఉండేవి పశువులు వాటిని సంరక్షించడం మన బాధ్యత అన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత గాలి కుంటు వ్యాధి టికాను రైతులందరూ తమ పశువులకు ఉపయోగించుకోవలన్నారు. మన ప్రాంత రైతులు వ్యవసాయం తో పాటు డైరీ మీద కూడా ఎక్కువ ఆధారపడుతున్నారని అన్నారు. వెంటర్నేటి డిపార్ట్మెంట్ వారు రైతులకు అందుబాటులో ఉండి వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, మాజీ ఎంపీటీసీ కొక్కలకొండ అరుణ, గడ్డమీది శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -