నవతెలంగాణ-హైదరాబాద్: ఆపరేషన్ సింధూర్‌తో పహల్గాం దాడికి పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఏళ్ల తరబడి ప్రత్యేక బలూచిస్థాన్ దేశం కావాలని పోరాడుతున్న బలూచ్ లిబిరేషన్ ఆర్మీ ఆదును చూసి పాకిస్థాన్ ఆర్మీపై ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా పాక్ జాతీయ జెండాలను తొలగించి, కొత్త దేశంగా బలూచిస్థాన్ ఏర్పడినట్టు, తమ దేశాన్ని అంతర్జాతీయ దేశాలు, సంస్థలు గుర్తించాలని బలూచి లిబిరేషన్ ఆర్మీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. అంతేకాకుండా దాయాది దేశంపై భారత్ దండయాత్రను స్వాగతించింది. ఈక్రమంలో తాజాగా పాక్-భారత్ మధ్య కాల్పుల విరమణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని పరోక్షంగా హెచ్చరించింది. పాకిస్థాన్ ఊసరవెళ్లిలా రంగులు మారుస్తుందని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసమని పేర్కొంది. ఆ దేశంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీకి విదేశీ మద్దతు ఉందంటూ వస్తున్న విమర్శలను బలూచిస్థాన్ తోసిపుచ్చింది.
పాకిస్థాన్ మాయ మాటలు నమ్మి మోసపోవద్ద: బలూచ్ ఆర్మీ
- Advertisement -
- Advertisement -