నవతెలంగాణ-హైదరాబాద్:BC రిజర్వేషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది.ప్రభుత్వం వేసిన స్పెషల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలను నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తెలిసిందే. ఆ మేరకు కులగణన సర్వే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకొనున్నట్లు పేర్కొంది. అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జీవో నెంబర్ 9ని విడుదల చేసి..స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం అమలైతున్నట్లు రేవంత్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై, జీవో నెంబర్ 9పై పలువురు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం..42శాతం బీసీ రిజర్వేషన్లను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా..ప్రభుత్వం వేసిన స్పెషల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.