నవతెలంగాణ నాగిరెడ్డిపేట్ : ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2023_ 2024_ 2024_2025 సంవత్సరాలలో పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు అందజేసినట్లు మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన కుంట రాఘవరెడ్డి తన తండ్రి కుంట సంగారెడ్డి జ్ఞాపకార్థం పదవ తరగతిలో మొదటి రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థులకు నగదు అందజేసినట్లు ఆయన తెలిపారు. మొదటి ర్యాంకు సాధించిన రజిత, కుమారి ప్రమతి కి 10 వేలు చొప్పున. రెండవ ర్యాంకు సాధించిన రామ్ చరణ్, భూమయ్యకు 5 వేలు నగదు అందజేశారు. అదేవిధంగా రాకేష్, గౌతమిరెడ్డి, అనన్య, సహస్రలకు ఒక్కొక్కరికి 2 వేల చొప్పున ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా పాఠశాల డిస్క్ బెంచీలకు 40 వేల నగదు ప్రధానోపాధ్యాయులకు అందజేసినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాల్రెడ్డి, గ్రామ పెద్దలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు నగదు అందజేత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES