నవతెలంగాణ-హైదరాబాద్: సితాఫలమండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS వాలంటీర్లు తమ ఐదో రోజు ప్రత్యేక శిబిరంలో భాగంగా ఘట్కేసర్ మండలంలోని కొర్రేముల గ్రామంలో హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో, గ్రామ పరిసరాల్లో మొక్కలు నాటడంతో పాటు పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు తెలియజేశారు. NSS కార్యక్రమ అధికారి బి. వెంకటేశం మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహంచారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ NG కృష్ణమూర్తి, డా. శివ నారాయణ, రాజు, డా. కిషోర్, ప్రత్యుష, రామకృష్ణ, వాలంటీర్స్ సందీప్, అరుణ్ కుమార్, మహాలక్ష్మి, దివ్య, ఈశ్వర్, నవీన్ కుమార్, దీపక్, ఖాళీథ్, సౌజన్య, పూజ, అంగనవాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అధికారులు విద్యార్థుల సేవా భావాన్ని ప్రశంసిస్తూ, “పచ్చదనం – సుస్థిర భవిష్యత్తు” లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.
