- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నవతెలంగాణ మెదక్ రీజినల్ డెస్క్ ఇంచార్జీ అనిల్ కుమార్ అకాల మరణం చెందారు. గురువారం రోజువారిలాగే అనిల్ విధులకు హాజరయ్యారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తొటి సిబ్బంది అప్రమత్తమై సీపీఆర్ నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం పట్ల నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ రాంపల్లి రమేష్, సీజీఎం పి. ప్రభాకర్, మెదక్ రీజియన్ మేనేజర్ రేవంత్, బోర్డు సభ్యులు, సబ్ ఎడిటర్లు, విలేఖర్లు, సిబ్బంది ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- Advertisement -