- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మరో వింత నిర్ణయం తీసుకున్నంది. ఆ దేశంలో చెస్ ఆడడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖామా ప్రెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. మే ఒకటి నుంచి చెస్‌ని నిలిపివేస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు ధ్రువీకరించారు. గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన ధర్మ ప్రచారం, దుర్మార్గ నివారణ చట్టం కింద బ్యాన్ విధిస్తున్నట్లు స్పోర్ట్స్ డైరెక్టరేట్ ప్రతినిధి అటల్ మష్వానీ పేర్కొన్నారు. చెస్ జూదానికి మూలంగా పరిగణిస్తున్నామని.. ఇస్లామిక్ చట్టాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించే వరకు నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు.
- Advertisement -