Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టపాసులు విక్రయించే వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలి

టపాసులు విక్రయించే వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ : దీపావళి పండుగ సందర్భంగా టపాసులు విక్రయించే వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలవకుర్తి అగ్నిమాపక కేంద్రం అధికారి చంద్రశేఖర్ సూచించారు.  శుక్రవారం ఆయన నవ తెలంగాణతో మాట్లాడారు. వ్యాపారస్తులు ఐరన్ రేకులతో షాపులు ఏర్పాట్ చేసుకోవాలని, కనీసం షాపు మధ్య షాపుకు 20 మీటర్ల దూరం ఉండాలని, వీలైనంత ఎక్కువగా బకెట్ల ద్వారా వాటర్ నిల్వ ఉంచుకోవాలని,  దుకాణాల వద్ద ప్రజలు అధిక సంఖ్యలో ఉండకుండా, టపాసులు కాల్చే సందర్భంగా చిన్నారులు దూరంగా ఉంచాలని. టపాసులు కాల్చి సమయంలో కాటన్ వస్తువులను వేసుకోవాలని ఆయన సూచించారు. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -