- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భారత సైన్యం విజయం సాధించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ పై పబ్లిక్ గా మాట్లాడని మోడీ ఇవాళ మీడియా ముందుకు రాబోతున్నారు. దీంతో ఆయన ఏం చెప్పబోతున్నారనే విషయాలపై యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
- Advertisement -