నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్- పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాల ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్’ (డీజీఎంవో)ల చర్చలు ముగిశాయి. హాట్‌లైన్ ద్వారా జరిగిన ఈ చర్చల్లో భారత డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంవో మేజర్ జనరల్ కాశిఫ్ చౌదరి పాల్గొన్నారు. వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకే చర్చలు జరగాల్సి ఉండగా.. సాయంత్రానికి వాయిదా పడ్డాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు, పీవోకే తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్, పాక్ సైన్యం కవ్వింపులు తదితర పరిణామాలతో ఇటీవల ఇరుదేశాల నడుమ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మే 10న ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ముగిసిన భారత్- పాకిస్థాన్ డీజీఎంవోల చర్చలు
- Advertisement -
- Advertisement -