Friday, October 17, 2025
E-PAPER
Homeజిల్లాలుఆర్ అండ్ బి రోడ్లకు మహార్దశ

ఆర్ అండ్ బి రోడ్లకు మహార్దశ

- Advertisement -

రహదారుల పునరుద్ధరణకు క్యాబినెట్ ఆమోదంరూ.80 కోట్లు మంజూరు
సీఎం, మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు
నవతెలంగాణ – వనపర్తి 

వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల పునరుద్ధరణకు రూ 80 కోట్ల నిధులు మంజూరైనట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10వేల కోట్ల రూపాయలతో 6000 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణకు గురువారం క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వనపర్తి నియోజకవర్గ పరిధిలోని వనపర్తి నుంచి గోపాల్పేట ,బుద్ధారం గండి వరకు రోడ్డు పునరుద్ధరణకు రూ.51 కోట్ల 54 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. వనపర్తి నుంచి ఆత్మకూరు రోడ్డు వనపర్తి టు రాజపేట వరకు రూ.12 కోట్ల 82 లక్షలు మంజూరయ్యయని పేర్కొన్నారు. వనపర్తి నుంచి బుద్ధారం రోడ్డు చిట్యాల మీదుగా 14 కోట్ల 68 లక్షలు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వివరించారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -