- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
తెలంగాణ రాష్ట్రంలో నేడు జరుగుతున్న బిసి బంద్ కు తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి ఒక ప్రకటనలో తెలిపారు. బిసిల హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ కార్యక్రమం అత్యంత అవసరమని, తమ సంఘం దీనికి పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. బిసిలకు సకల హక్కులు, సరైన ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాల అమలు కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని వలి తెలిపారు.తమ సంఘం సభ్యులు, అనుబంధ సంస్థలు బంద్ ను విజయవంతం చేయడానికి చురుకైన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.
- Advertisement -