నవతెలంగాణ – పెద్దవూర
పత్తి రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మొబైల్లో ‘కపాస్ కిసాన్’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పత్తి రైతులకు కాపాస్ కిసాన్ యాప్ ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ విస్తరణ అధికారులు ఆంజనేయులు, స్వాతి సూచించారు. జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ నేపథ్యంలో శుక్రవారం మండలం లోని బట్టు గూడెం గ్రామం లో పత్తి చేలను పరిశీలించి రైతులకు కాపాస్ కిసాన్ యాప్ పై అవగాహన కల్పించారు. పత్తి రైతులు కనీస మద్దతు ధరకు సీసీఐకి పంటను అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కపాస్ కీపాన్’ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. రైతులు పత్తిని ఎంఎస్పీ కింద విక్రయించాలంటే ఈ యాప్ ద్వారా ముందుగా నమోదు చేసుకోవాలన్నారు.పత్తి రైతులు మొబైల్ నంబర్ లింక్ లేని వారికి లాగర్ యాప్ లో మొబైల్ నంబర్ అప్డేట్ చేశామని తెలిపారు. పత్తి పంటను ప్రత్తి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే కపాస్ కిసాన్ యాప్ లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని అన్నారు. రైతులు ఏరోజు, ఏ మిల్లుకు పత్తి పంటను తీసుకెళ్దాం అనుకుంటున్నారో ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని తీసుకెళ్లాలని తెలిపారు. ఒక వేళ స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వెళ్లలేకపోతే స్లాట్ రద్దు కూడా చేసుకోవచ్చు అని వివరించారు. రైతుల నమోదు, పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్, ధరల సమాచారం కూడా ఉంటుందని తెలిపారు. సమీప సీసీఐ కొనుగోలు కేంద్రాల వివరాలు తదితర సమాచారం యాప్లో ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో11 సీసీఐ, 36 జిన్నింగ్ కేంద్రాల్లో రోజుకు సగటున 10,490 క్వింటాళ్ల పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. క్వింటాలుకు రూ.7521 కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని అన్నారు.
పత్తి రైతులకు ‘కపాస్ కిసాన్’ యాప్ తో రైతులకు ఎంతో మేలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES