Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీల రిజర్వేషన్లు రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి

బీసీల రిజర్వేషన్లు రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి

- Advertisement -

– అఖిలపక్ష పార్టీలు  కేంద్రంపై యుద్ధం చేయాలి
– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి 
నవతెలంగాణ – బల్మూరు  :  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతూ తీర్మానం చేసి గవర్నర్ ఆర్డినెన్స్ బిల్లు పాస్ చేయాలని పంపితే చార్జ్ చేయకుండా కాలయాపనం చేస్తున్న తీరును నిరసిస్తూ బీసీ సంఘాలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బందు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతుప్రకటించారు.  మండల కేంద్రంలో ఉన్న స్కూల్స్ వ్యాపార దుకాణాలు  బంద్ చేయించి రోడ్డుపైన నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖదీర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు శివశంకర్, తిరుపతయ్య బీసీ  సంఘం నాయకులు శంకర్ సుధాకర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. బీసీలు రాజకీయంగా విద్యా ఉద్యోగ పరంగా స్వతంత్ర కాలం నుంచి ఇప్పటివరకు ఇంకా వెనుకబడి ఉన్నారని వారి జనాభా ఎంతో రిజర్వేషన్ కల్పిస్తే తప్ప అభివృద్ధికి నోచుకోరని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల నాయకులు ఎండి లాల్ మమ్మద్ బాబర్ ఆంజనేయులు మాసయ్య కృష్ణయ్య భారీమం టిఆర్ఎస్ నాయకులు తిరుపతయ్య కాంగ్రెస్ నాయకులు ఖదీర్ వెంకటయ్య కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -