నవతెలంగాణ-తుంగతుర్తి : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం నాటకమాడుతుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ లో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల బిల్లును,ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటూ మరోవైపు బీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.రిజర్వేషన్లను అమలు చేసే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు.అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఏకగ్రీవంగా ఆమోదించి,బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆరు నెలలు దాటిన ఆమోదించలేదని మండిపడ్డారు.కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపైనే ఉందన్నారు.కాంగ్రెస్ కూడా బంద్‌కు మద్దతు ఇచ్చిందని రాష్ట్ర బంద్ ఎవరికి వ్యతిరేకంగా జరుగుతున్నదని ప్రశ్నించారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకునేది బిజెపి పార్టీయేననీ, ఇది అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
బీసీ బిల్లును అడ్డుకునేది బిజెపియే : మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES