నవతెలంగాణ-ఆర్మూర్: తెలంగాణ బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బందు ప్రశాంతంగా కొనసాగింది. టిఎస్ ఆర్‌టిసి బస్సులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సైతం బందు పాటించాయి. దుకాణ సముదాయాలను సైతం మూసి ఉంచినారు. బంద్ సంబదర్భంగా శనివారం సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మామిడిపల్లి, పెరికిట్ బైకుపై ర్యాలీగా తిరుగుతూ , 42 శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలని నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన బీసీలు అనేక రకాలుగా వెనుకబడిపోయారని, వారి కోసం కులగణన ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సింది ఉండగా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలపై బీసీలను మోసం చేయాలని బీజేపీ చూస్తుందని అన్నారు. తక్షణమే రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో బిసి రిజర్వేషన్ బిల్లు 42% రిజర్వేషన్ అమలు పొందుపరచాలని, లేనియెడల బీజేపీకి బీసీ వర్గాలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారుజ. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ కూడా బిజెపి పై ఒత్తిడి తీసుకురావడానికి అట్ల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బిజెపి ప్రభుత్వాన్ని వత్తిరి చేసి 42% రిజర్వేషన్ బీసీలకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు విడగొట్టి సాయిలు, కూతాడి ఎల్లయ్య, బి రవి, సాయిలు, దాసు, శ్రావణ్ కుమార్, ఓంకార్, కలీం, లాల్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
…సంఘీభావం తెలిపిన ఫౌండేషన్ ప్రతినిధులు…
బిసి రిజర్వేషన్ కి మద్దతుగా సామాజిక నాయకులు జి జి ఫౌండేషన్ చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతి , ఫౌండేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా సంఘీభావం తెలిపినారు.