Sunday, October 19, 2025
E-PAPER
Homeనిజామాబాద్జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మండల నాయకుల ప్రచారం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మండల నాయకుల ప్రచారం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం జూబ్లీహిల్స్ లోని షేక్ పేట్ డివిజన్ బూత్ నంబర్ 9,11లో గత వారం రోజుల నుండి ప్రతి రోజు విస్తృతంగా మండల నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

మండలానికి చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నరెడ్డి, బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సమన్వయ సభ్యులు ఎండీ అహ్మద్ హుస్సేన్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, బిఆర్ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షులు బద్దం రాజశేఖర్, కమ్మర్ పల్లి బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కొంటి కంటి నరేందర్, తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -