- బీసీ జేఏసి
నవతెలంగాణ-భువనగిరి: బీసీ సంఘాల రాష్ట్ర బంద్ పిలుపు మేరకు శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చేపట్టిన బంధు విజయవంతమైంది. బీసీ సంఘాల ఆధ్వర్యంలో, సిపిఎం ఆధ్వర్యంలో వేరువేరుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బిసి సమన్వయకర్త మెరుగు మధు, మాటూరి అశోక్ ల ఆధ్వర్యంలో బిసి జేఏసీ బంద్ సందర్భంగా
బిజెపి, కాంగ్రెస్,టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం బీఎస్పీ దలిత సంఘాలు, మైనార్టీ సంఘాలు,
బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారు.
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్య బీసీలందరు సహకారంతో రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉందని తెలిపారు.సంక్షేమ శాఖ మరియు ఫైనాన్సు కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ ఒండ్రు శోభారాణి మాట్లాడుతూ రిజర్వేషన్ సాధించేవరకు తీసుకురా ఐక్యంగా నిలవాలి అన్నారు. రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్ కేంద్రం, రాష్ట్రం లలో అధికార పార్టీ నాయకులకు బిసి రిజర్వేషన్ పై చిత్తశుద్ధి ఉండాలని అన్నారు.
జిల్లా బిజెపి అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు తరుగుతే బీసీ సమాజానికి రిజర్వేషన్లు అందే అవకాశం ఉందని చెప్పారు.బిఆర్ఎస్ నాయకులు పెంట నరసింహ, అతీకం లక్ష్మీనారాయణ గౌడ్,
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి ఇమ్రాన్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకoగా పనిచేస్తున్న వారందరినీ హెచ్చరించారు.
కార్యక్రమంలో అవేస్ చిస్తి ,పోత్నక్ ప్రమోద్ కుమార్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ నరసింహాచారి, బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మాయ దశరథ, కూర వెంకటేష్, రత్నపురం బలరాం, ఏవి కిరణ్, ఎశాల అశోక్,ఎనబోయిన ఆంజనేయులు, బీసీ సంఘాల ప్రతినిధులు కొత్త నరసింహస్వామి, సభను కారు వెంకటేష్, చిక్క ప్రభాకర్, పద్మశాలి సంఘం చిక్క వెంకటేశం, కుమ్మరి సంఘం నాయకులు దరిపల్లి ప్రవీణ్ కుమార్, ఓడ్రంగి సంఘం చిన్నోజు నరేంద్ర చారి, స్వర్ణకార సంఘం ఇటికాలా దేవేంద్ర స్వామి, బీఎస్పీ బట్టు రామచంద్రయ్య, బండారు రవివర్ధన్, బెండ శ్రీకాంత్, ఆటో జాక్ నాయకులు గోపరాజు గణేష్, గొర్ల లక్ష్మణ్, శ్యామల శోభన్ బాబు, కొంచెం విజయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు దేవేందర్, దుబ్బ రామకృష్ణ, మహేందర్,బిజెపి ఓబీసీ నాయకులు పట్నం కపిల్, మేడి కోటేష్, రమేష్ కోటి, పుట్ట రమేష్, వెంకటేష్
పాల్గొన్నారు