నవతెలంగాణ-చారకొండ: మండల కేంద్రంలోనీ ప్రాథమిక పశు వైద్య కేంద్రంను జిల్లా పశుసంవర్ధక అధికారి జ్ఞాన శేఖర్ సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించి, జేపల్లి, మర్రిపల్లిలో కొనసాగుతున్న గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మండలంలోని అన్ని పశువులకు, సకాలంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలని మండల పశువైద్యాధికారి శివకుమార్‌ను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పాడి రైతులకు సూచించారు. ఇప్పటివరకు 182 గేదెలు, 235 ఆవులకు టీకాలు వేసినట్లు మండల పశువైద్యాధికారి శివకుమార్ తెలిపారు. ఆయనతోపాటు విఎల్వో షేక్ మాదర్, ఎల్ ఎస్ ఏ వెంకటేశ్వర్లు, ఓఎస్ శివరాం, గోపాల మిత్రులు మల్లయ్య, గిరిబాబులు ఉన్నారు
పశు వైద్యశాలను సందర్శించిన జిల్లా వైద్యాధికారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES