– ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
నవతెలంగాణ-పెబ్బేరు : ఎలాంటి హెచ్చరిక సిగ్నల్స్ ఇవ్వకుండా రోడ్డుపై డీసీఎంను సడన్గా ఆపడంతో వెనకాలే వస్తున్న కారు డీసీఎంను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 03.30 గంటలకు పెబ్బేరు శివారులోని నందగోకుల్ హోటల్ సమీపంలో జాతీయ రహదారి పై కర్నూల్ వైపు వెళ్తున్న ఓ డీసీఎం డ్రైవరు నిర్లక్ష్యంగా ఎలాంటి హెచ్చరిక సిగ్నల్స్ ఇవ్వకుండా అకస్మాత్తుగా డీసీఎం ను రోడ్డుపై ఆపేశాడు. దీంతో దాని వెనకాలే బ్యాండ్ ట్రూప్ హైదరాబాద్ నుంచి కర్నూల్ కి బ్యాండ్ కొట్టడానికి కారులో వెళ్తున్నారు. కారు డ్రైవరు వీలైనంతవరకు కంట్రోల్ చేసినప్పటికీ డీసీఎం ను వెనకాల నుండి ఢీకొట్టాడు. దీంతో హైదరాబద్ కొంపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మనీష్ (24), కామా రెడ్డికి చెందిన డ్రైవర్ నాగరాజు(24)లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ఉన్న విశాల్, రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలు కావడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన ఇద్దరు మృతదేహాలను వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మృతుడు మనీష్ తండ్రి జంగాల రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యం వహించిన డీసీఎం డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES