No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంభారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు నా సెల్యూట్ : ప్రధాని మోడీ

భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు నా సెల్యూట్ : ప్రధాని మోడీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జాతినుద్దేశంచి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు మోడీ సెల్యూట్ చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయని కొనియాడారు. దేశ ప్రజలందరి తరపున సైన్యానికి అభినందనలు చెబుతున్నానన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు చెప్పారు. పహల్గామ్‌లో అత్యంత దారుణంగా కుటుంబ సభ్యుల ముందు భాగస్వాములను ఉగ్రవాదులు చంపేశారని.. ఇది వ్యక్తిగతంగా తనను ఎంతగానో బాధించిందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు.
పాక్ తదుపరి చర్యలపై కన్నేసి ఉంచామన్నారు. పాక్ తొక జాడిస్తే పరిణమాలు మరింత తీవ్రంగా ఉంటాయి. పాక్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదన్నారు ఆ పరిస్తితే వస్తే భారత్ కి ఏం చేయాలో భారత్ కు బాగా తెలుసన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad