నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. న్యూయార్క్ నుండి శాన్‌ఫ్రాన్సిస్కో వరకు 50 రాష్ట్రాల్లో 2,500 పైగా ప్రదర్శనలు జరిగాయి. నగరాలు, పట్టణాల్లోని వీధులు, పార్కులు, బహిరంగ ప్రదేశాలు ఆందోళనకారులతో నిండిపోయాయి. జూన్‌లో జరిగిన ఆందోళనల కంటే ఎక్కువగా లక్షలాది అమెరికన్లు ఈ ప్రదర్శనల్లో పాల్గోని రికార్డు సృష్టించారు. అమెరికాలో రాజులు, సింహాసనాలు, కిరీటాలు లేవు అంటూ ట్రంప్‌ను ఉద్దేశించి నినాదాలు చేశారు. లేబర్ యూనియన్లు, ఇండివిజిబుల్ , ఎఎఫ్‌టి, మూవ్ ఆన్ , ఎస్‌ఇఐవి, ఎసిఎల్‌యు వంటి సంస్థలు ఈ ఆందోళనలకు నాయకత్వం వహించాయి.
ప్రజాస్వామ్యాన్ని, వలసదారుల హక్కులను కాపాడాలని ఆందోళనాకారులు డిమాండ్ చేశారు..ప్రభుత్వం షట్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకి సంభందించిన పనులకు అంతరాయం ఏర్పడింది. అక్రమ వలదారులు పేరు చెప్పి ప్రముఖ పట్టనాల్లో నేషనల్ గార్డులను ట్రంప్ మోహరించారు. అంతేకాదు చారిత్రాత్మక నగరం చికాగోను హత్యల నగరం అని హేళన చేశారు..దీంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబీకింది. దేశ రాజధాని వాషింగ్టన్ డీసి లోని నేషనల్ మాల్ వద్ద జరిగిన శాంతియుత ప్రదర్శనలో దాదాపు లక్ష మంది ప్రజలు పాల్గోన్నారు. దీనిలో ప్రముఖ సోషలిస్టు బెర్ని స్టాండర్స్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ట్రంప్ ప్రజల ఆరోగ్య సేవలను నిలిపేయడం తగద న్నారు.
ఇమ్మిగ్రేషన్ రైడ్స్‌తో వలస వచ్చినవారిపై కూృరంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రదర్శనలను హేట్ అమెరికా అని రిపబ్లికన్లు అంటు న్నారని, అయితే ఇవి లవ్ అమెరికా ర్యాలీలని పేర్కొన్నా రు..అమెరికా ఎన్నటికీ నిరంకుశత్వాన్ని ఆమోదించదని తెలిపారు.. అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాక్సన్ ఈ ప్రదర్శనలు హమాస్‌కు మద్దతుగా జరిగాయని, దీని వెనక మార్క్సిస్టులు, ఆంటీఫాలు ఉన్నారని ఆరోపించారు..డెమోక్రాట్లు కూడా సంఘీభావం తెలిపారు.. బెర్లిన్ , రోమ్, పారిస్, స్వీడన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల వద్ద నో కింగ్‌డేకి మద్దతుగా పలువురు నిరసన చేసి మద్దతు తెలిపారు.
నో కింగ్స్ అంటే ఏంటి ?
అధ్యక్షుడు ట్రంప్ 79 వ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 14వ తేదీన వాషింగ్టన్ నేషనల్ మాల్ వద్ద భారీ ఎత్తున సైనిక ప్రదర్శనలు, ప్రత్యక్ష సంగీత కచేరీలను ఉత్సవంగా నిర్వహించారు. దీనికి సుమారు 375 కోట్టు ఖర్చు చేశారు. ఇది అలనాటి రాజుల పుట్టిన రోజుల వేడుకలను తలపించేదిగా ఉందని అనేక మంది విమర్శించారు.
దీన్ని వ్వతిరేకిస్తూ 200 పైగా సంస్థలు ట్రంప్ వలస విధానాలను నిరసిస్తూ అదే రోజు ఆందోళనలకు పిలుపునిచ్చారు.. అలా ట్రంప్ పుట్టిన రోజు సందర్భంగా ఆవిర్భవించిందే నో కింగ్స్ డే ఆందోళనలు. రెండో విడతగా శనివారం నాడు ఆందోళనలు నిర్వహించారు. అమెరికా నియంతల పరిపాలనలో లేదని, ట్రంప్ రాజు కాదని ప్రజలదే అధికారమని అమెరికన్లు నిరసనలతో దేశమంతా హోరెత్తించారు..ఈ నిరసనలతో డెమోక్రాట్లు ఆందోళన చెందారు. దీంతో శనివారం ట్రంప్ మీడియాతో నేనే రాజును కాదు’ అని చెప్పాల్సి వచ్చింది.