నవతెలంగాణ-తుంగతుర్తి
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడంతో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని,దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి,నిలదీయాలని చెప్పేందుకే బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వెలుగుపల్లి మాజీ ఎంపీటీసీ మట్టపల్లి కవిత కుమార్ అన్నారు.ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ బాకీ కార్డు ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు,420 హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని,22 నెలల కాంగ్రెస్ పాలనలో హామీల అమలులో విఫలమైందని అన్నారు.ప్రజలకు ఇవ్వాల్సిన బాకీలను ఎప్పటి వరకు ఇస్తారో ప్రభుత్వం గడువు చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలకు నెలకు 2,500,స్కూటీలు ఇవ్వలేదని, కల్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకం లబ్దిదారులకు తులం బంగారం బాకీ ఉందని,వృద్ధులు, వితంతువులు,వికలాంగుల పెన్షన్లను రెట్టింపు చేయకుండా బకాయి పడిందని అన్నారు.అనంతరం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మల్లెపాక రాములు,గుడిపాటి వీరయ్య,యాకోబు,సోమేష్,పరమేష్,పాలబిందెల మల్లయ్య,లింగయ్య,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకే బాకీ కార్డుల పంపిణీ మాజీ ఎంపీటీసీ మట్టపల్లి కవిత కుమార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES