Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అలేరు ఎస్ఐ

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అలేరు ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
దీపావళి పండుగ వెలుగుల పండుగగా అందరికీ ఆనందం కలిగిస్తుందని,అయితే సురక్షితతను మరిచిపోవద్దని ఆలేరు ఎస్ఐ వినయ్ సూచించారు.ఆదివారం నవ తెలంగాణ విలేకరి తో మాట్లాడుతూ పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని,పిల్లలను పెద్దవారు పర్యవేక్షించాలని తెలిపారు.సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు ధరించాలన్నారు.సగం కాలిన టపాసులను తాకరాదని,టపాసులు ఖాళీ ప్రదేశంలోనే కాల్చాలని సూచించారు.ప్రతి ఇంట్లో నీటి బకెట్ లేదా అగ్నిమాపక పరికరం సిద్ధంగా ఉంచితే మంచిదని చెప్పారు.జాగ్రత్తలు పాటిస్తే దీపావళి మరింత సురక్షితంగా,ఆనందంగా ఉంటుందని ఎస్ఐ  తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -