నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులోని నీలగిరి మెంటెన్ రైల్వే సర్వీసు నిలిచిపోయాయి.ఇటీవల కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కొల్లారు నుంచి కన్నూర్ వెళ్లే రైలు మార్గంలో రాళ్లు, చెట్లు విరిగిలపడ్డాయని, కొండచరియలు విరిగిపడడంతో పలు చోట్ల ట్రాక్ దెబ్బతిందని అధికారులు తెలిపారు. దీంతో ఆయా మార్గాల్లో నడిచి పలు రైలును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
రైలు నెం. 56136 మెట్టుపాళయం – ఉదగమండలం. రైలు నెం. 56137 ఉదగమండలం – మెట్టుపాళయం. రైలు నెం. 06171 మెట్టుపాళయం – ఉదగమండలం ప్రత్యేక రైల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు అని దక్షిణ రైల్వేలోని సేలం డివిజన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.