నవతెలంగాణ-హైదరాబాద్: సితాఫలమండీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS యూనిట్–1 ఆధ్వర్యంలో ఘట్‌కేసర్ మండలంలోని కొర్రేముల గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి హాజరై విద్యార్థి స్వచ్ఛంద సేవకుల సేవా కార్యక్రమాలను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ బంగ్లా భారతి మాట్లాడుతూ..“సమాజ సేవలో విద్యార్థుల పాత్ర అపారమైంది. NSS శిబిరాలు విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. గ్రామీణ అభివృద్ధికి యువత ముఖ్యమైన శక్తి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ బి. వెంకటేశం, కళాశాల అధ్యాపకులు, డా. కిషోర్, రామకృష్ణ, ఐమాన్ గారు, ప్రత్యుష , క్యాంపు సీనియర్స్ మహాలక్ష్మి, సాయి, NSS వాలంటీర్లు అరుణ, సౌజన్య, దివ్య శ్రీ, నందిని, అరుణ్ కుమార్, నవీన్ కుమార్, దీపక్, ఖలీద్, ఈశ్వర్, రాజకుమార్, జయరాజు, స్నేహ సంధ్య, వివేకానంద తదితరులు పాల్గొన్నారు.