నవతెలంగాణ-హైదరాబాద్: జేఈఈ మెయిన్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్‌లో జరుగనున్నాయి. తొలి సెషన్ జనవరి 21 నుంచి 30 మధ్య జరుగనుండగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. అభ్యర్థులు jeemain.nta.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పింది. ఏప్రిల్ ఒకటి నుంచి 10 మధ్య రెండో సెషన్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. అయితే, పరీక్షలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను త్వరలోనే ప్రకటించనున్నది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు www.nta.ac.in, jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్లను చెక్ చేస్తూ ఉండాలని.. అప్పుడే పరీక్షలకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చని ఎన్‌టీఏ డైరెక్టర్ పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES