నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది. దీనికి దీపావళి పండుగ పూట ఒక్కసారిగి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 350 దగ్గర నమోదైంది. ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత నమోదు కావడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వాస్తవంగా ఢిల్లీలో గ్రీన్ కాకర్స్ కాల్చుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా దీనికంటూ ఒక సమయాన్ని కూడా కేటాయించింది. కానీ గ్రీన్ కాకర్స్ కాకుండా పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి కాల్చినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం వాతావరణం చాలా మబ్బుగా కనిపిస్తోంది. పూర్తిగా గాలి నాణ్యత కోల్పోయింది. దీంతో గ్రీన్ క్రాకర్స్ కాకుండా విపరీతంగా రాకెట్లు, బాణాసంచా కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఎక్కువసేపు కాలుష్యానికి గురైతే ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని.. అంతేకాకుండాగుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని డాక్టర్లు వార్నింగ్ ఇస్తున్నారు.