నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ప్రధానిగా సనే తకైచి ఎన్నికయ్యారు. ఈమె ఆ దేశానికి తొలి మహిళా కావడం విశేషం. పార్లమెంటులోని దిగువ సభ 465 ఓట్లలో తకైచి 237 ఓట్లను గెలుచుకున్నారు. దిగువ సభలో జరిగిన మొదటి రౌండ్ ఓటింగ్‌లో కాన్‌స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు యోషిహికో నోడాకు 149 ఓట్లు రాగా, ఎల్‌డిపి పార్టీ అభ్యర్థి తకైచి 237 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు జపాన్ న్యూస్ ఏజెన్సీ క్యోడో తెలిపింది.
కాగా, ప్రధానిగా తకైచి ముందు అనేక సవాళ్లున్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం, అవినీతి కుంభకోణాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు… ఇన్ని సవాళ్ల మధ్య సనై తకైచి ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.