నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో నలంద హైస్కూల్లో 4వ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మంగళవారం ఈ అబ్యాస్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఐఐటి & ఒలంపియాడ్ కు సంబంధించిన ఆర్యబట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహించారు. దాదాపు తరగతికి ఐదుగురు విద్యార్థుల చొప్పున దగ్గర, దగ్గరగా 60 విద్యార్థులు ఈ పరీక్ష లో పాల్గొన్నారు . ఈ సందర్భంగా పాఠశాల మేనేజ్మెంట్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ అభ్యాస్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐఐటి & ఒలంపియాడ్ సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని , ఈ పరీక్షల వలన విద్యార్థులకు సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ , మెంటల్ ఎబిలిటీ లో విద్యార్థులకు భవిష్యత్తులో జేఈఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్ , ఎంసెట్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇట్టి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐటి & ఒలంపియాడ్ ఇంచార్జ్ ఉపాధ్యాయులైన రాజశ్రీ , శ్వేతా , శివ , షాకీర్ ల ఆధ్వర్యంలో ఆర్యబట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ,విద్యార్థులు పాల్గొన్నారు.
నలంద స్కూల్లో ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES