Tuesday, October 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హ్యాట్సాఫ్ పోలీస్

హ్యాట్సాఫ్ పోలీస్

- Advertisement -

రియాజ్ ఎన్కౌంటర్ పై సోషియల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశంసలు 
పటాకులు కాల్చిన ప్రజలు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ సామజిక మాధ్యమాలలో హోరెత్తి పోయింది. జయా హో సిపి, జయా హో అంటూ పోలీసులకు ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి. నిజామాబాద్ లోని ప్రజలు ప్రస్తుతం ఇతర టూర్ ప్యాకేజీలు ఆయా దేశాల్లో ఉన్న వారు సైతం ఈ  ఎన్ కౌంటర్ పై స్పందిస్తున్నారు. ముఖ్యంగా కమిషనర్ సాయి చైతన్య చొరవ చూపారంటూ మెచ్చుకుంటున్నారు. ప్రముఖులు సైతం ఈ ఘటన ను పోస్టు చేసారు. నిందితుడికి తగిన శాస్త్రి జరిగిందంటున్నారు. హత్యకు గురైన ప్రమోద్ సహచర పోలీసులు పటాకులు కాల్చి సంబరాలు చేశారు. దీపావళి రోజు నిజమైన నరకాసుర వధ జరిగిందంటూ జిల్లా ప్రజలు పటాకులు కలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆదివారం నగర శివారులోని సారంగాపూర్ లో పట్టుబడిన రియాజ్ ఎన్ కౌంటర్ అయిన తరువాత  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి వద్దకు వందలాది మంది యువకులు తరలి వచ్చారు. ఆసుపత్రి ఎదుట పటాకులు కాల్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -