– సీపీఐ(ఎం) ఖండన
– నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి : జాన్‌వెస్లీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కరాచీ బేకరీపై మతోన్మాద అరాచక శక్తులు దాడి చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశం మీద ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా సైన్యానికి మద్దతుగా నిలబడ్డారని తెలిపారు. ఈ సందర్భంలో ఇలాంటి చర్యలు అనైక్యతకు దారితీస్తాయని పేర్కొన్నారు. దేశ విభజన సందర్భం గా పాకిస్తాన్ కరాచీ నుంచి వచ్చినటు వంటి హిందువుల కుటుంబం ఆ పేరుతో ఏండ్ల తరబడి దేశవ్యాప్తంగా బేకరీలను నడిపిస్తున్నదని గుర్తు చేశారు. మతోన్మాదులు పాకిస్తాన్ నగరం పేరు ఉండకూడదంటూ ఈ అరాచకానికి పాల్పడటం శోచనీయమ ని విమర్శించారు. ఇలాంటి చర్యలకు అవకాశం ఇవ్వకుండా నిందితులపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరాచీ బేకరీపై అరాచక శక్తుల దాడికి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES