– ఉపాధి కూలీలను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
– సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేటలో ఘటన
నవతెలంగాణ-దుబ్బాక
పొట్ట కూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్తున్న మహిళా కూలీలను డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన కారు బలంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేటలో సోమవారం జరిగింది. దుబ్బాక సీఐ పి.శ్రీనివాస్, భూంపల్లి ఎస్‌ఐ హరీష్‌గౌడ్, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన గోప దేవవ్వ (జాబ్ కార్డు నంబర్- 10492), బ్యాగరి చంద్రవ్వ (జాబ్ కార్డు నెంబర్ – 10727), బైండ్ల లాస్య.. రోజువారీ లాగానే సోమవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. అయితే మెదక్‌లో ఓ పెండ్లికి హాజరయ్యేందుకు బెల్లంపల్లి నుంచి బాల్మీకి జ్ఞాన్‌సింగ్, అతని నానమ్మతో కలిసి కారులో వస్తుండగా.. ఉదయం 7 గంటల 20 నిమిషాల సమయంలో 765 డీజీ నేషనల్ హైవేపై పోతారెడ్డిపేట వద్ద ఆ ఉపాధి కూలీలను వేగంగా ఢకొీట్టాడు. దాంతో ఉపాధి కూలీలు గోప దేవమ్మ (48), బ్యాగరి చంద్రవ్వ (45) అక్కడికక్కడే మృతిచెందారు. బైండ్ల లాస్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై టెంటు వేసి అక్కడే బైటాయించి ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని.. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, దుబ్బాక సీఐ పి.శ్రీనివాస్ చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాకలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు బ్యాగరి చంద్రవ్వ కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు డ్రైవర్ జ్ఞాన్‌సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ పరామర్శ..
ఘటనా స్థలిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య పరిశీలించి.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జిల్లా కలెక్టర్ మనుచౌదరితో మాట్లాడి ప్రభుత్వపరంగా ఆదుకుంటా మని భరోసానిచ్చారు. డీఆర్‌డీఏ పీడీ జయదేవ్ ఆర్య, ఆర్డీవో సదానందం మృతుల కుటుంబాలకు ఉపాధి హామీ చట్టం ద్వారా రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు. మహిళా గ్రూపుల ద్వారా రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి వెంట ఎంపీడీవో వేలేటి భాస్కర శర్మ, ఎంపీఓలు, దుబ్బాక, భూంపల్లి ఎస్సైలు గంగరాజు, హరీష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి హరీష్ గౌడ్ పలువురున్నారు.
అతివేగం.. అజాగ్రత్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES