Thursday, October 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై నేడు కేసీఆర్‌ సమావేశం..

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై నేడు కేసీఆర్‌ సమావేశం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నియోజకవర్గంలోని క్లస్టర్‌ ఇన్‌చార్జులు, పార్టీ సీనియర్‌ నాయకులతో ఎర్రవెల్లి నివాసంలో గురువారం ఆయన ఈ కీలక సమావేశం నిర్వహించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన పూర్తయిన నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. ఇకపై ప్రచార వ్యూహాలే గెలుపులో కీలకం కానున్నాయి.

ఈ క్రమంలో పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నేతలు హాజరయ్యే ఈ సమావేశంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహ్యాలపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రచారంలో పాల్గొనే స్టార్‌ క్యాంపెయినర్లు అనుసరించాలని విధానాలపై సూచనలు, సలహాలు కేసీఆర్‌ ఇవ్వనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -