నవతెలంగాణ-హైదరాబాద్: ఈ నెల 26న మలేషియ వేదికగా 22వ ఏషియన్ సదస్సు జరుగనుంది. ఈ కార్యక్రమానికి పలు దేశాల అగ్రనేతలు హాజరుకానున్నారు. తాజాగా ఏషియన్ సదస్సుకు ప్రధాని మోడీ వర్చువల్‌గా హాజరుకానున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానించారని విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సదస్సు వేదిగా ఇరుదేశాల ASEAN-భారత్ సంబంధాల పురోగతిని సమీక్షించున్నారు. అదే విధంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల అధినేతలు పలు ఒప్పందాలు చేసుకొనున్నారు.
ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. దీంతో ప్రధాని మోడీ, ట్రంప్ తో భేటీ కానున్నారని, ఇరుదేశాల మధ్య తలెత్తిన టారిఫ్ వివాదాలపై చర్చించనున్నారని వార్తలు పుకార్లు చేశాయి. తాజా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటనతో ట్రంప్, మోడీ భేటీ లేనట్లు తెలుస్తోంది.